బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు..!

దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు..!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 6:34 AM

దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మే7 వరకు ఈ అల్పపీడనం వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. అలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది.

Read This Story Also: ‘కరోనా’ తరువాత కూడా వారికి ఇదే గౌరవం కొనసాగాలని ఆశిస్తున్నా: వెంకటేష్