AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు పెద్ద ఊరట.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ మళ్లీ వెనక్కి..!

ఆర్బీఐ వడ్డీ రేట్లను రాబోయే ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. వడ్డీ రేట్ల పెంపు ఉండదని ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం.

RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు పెద్ద ఊరట.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ మళ్లీ వెనక్కి..!
Rbi
Venkatrao Lella
|

Updated on: Jun 26, 2026 | 11:42 AM

Share

ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. వచ్చే నెలలో జరిగే ఎంపీసీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం సాగుతోంది. గత మూడు సమావేశాల్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచలేదు. వడ్డీ రేట్లను యాథాతధంగా ఉంచుతూ వస్తోంది. అయితే వచ్చే నెలలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు పెరగడంతో పాటు కొత్తగా లోన్లు తీసుకునేవారికి అధిక వడ్డీ పడనుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి మాత్రం అధిక వడ్డీ వల్ల లబ్ది చేకూరనుంది.

వడ్డీ రేట్ల పెంపు లేనట్లేనా..?

మొన్నటివరకు అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో వడ్డీ రేట్లను పెంచడంపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. కానీ ప్రస్తుతం యుద్దం ముగిసిపోవడం, అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టడం, ముడి చమురు ధరలు తగ్గిన క్రమంలో అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ సానుకూల పరిస్థితుల క్రమంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్ల పెంపు గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. వడ్డీ రేట్ల పెంపుకు సిద్దమైతే తమ విధాన వైఖరిని ఇప్పటికే మార్చుకునేవాళ్లమంటూ వ్యాఖ్యానించారు. వచ్చే సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు సిద్దమైతే తమ వైఖరిని తటస్థం నుంచి నియంత్రణ స్థాయికి మార్చుకునేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, అది గరిష్ట పరిమితికి చేరిందని వ్యాఖ్యానించారు.

దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతం..

భవిష్యత్తులో గణాంకాల ఆధారంగానే వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు ఉండదని అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడం శుభపరిణామమని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా సానుూల అంశమని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు దిగి రావడం, యూరియా ధరలు తగ్గడం మంచి పరిణామమన్నారు. ఇదే జరిగే లోన్లు తీసుకునేవారికి, ఈఎంఐలు కట్టేవారికి ఊరటగా చెప్పవచ్చు. కాగా జూన్‌లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద ఉంచింది.

Follow Us
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!