AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.1.44 లక్షల జీతంతో ISROలో టీచర్ జాబ్స్.. మరికొన్ని గంటలే ఛాన్స్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR).. తిరుపతిలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, ప్రైమరీ టీచర్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు జూలై 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.1.44 లక్షల వరకు వేతనం అందనుంది..

నెలకు రూ.1.44 లక్షల జీతంతో ISROలో టీచర్ జాబ్స్.. మరికొన్ని గంటలే ఛాన్స్
ISRO SDSC SHAR Teacher Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 26, 2026 | 8:11 AM

Share

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR).. తిరుపతిలో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను జూలై 7, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్ట్రో సంస్థ మొత్తం 10 టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) మ్యాథమెటిక్స్, సైన్స్, తెలుగు ఉద్యోగాలు 4, ప్రైమరీ టీచర్ (PRT) ఉద్యోగాలు 6 వరకు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ISRO తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బీఈడ్ (B.Ed), డీఈడ్ (D.Ed), ఎంఈడ్ (M.Ed), బీఈఎల్ఈడ్ (B.El.Ed) లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమాలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి. అలాగే రాష్ట్ర టెట్ (TET) లేదా సీటెట్ (CTET)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి TGT పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,44,400 వరకు, ప్రైమరీ టీచర్ పోస్టులకు: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన వారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ISRO తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us