బ్రెజిల్ తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ లో మా తప్పేమీ లేదు.. భారత్ బయో టెక్ క్లారిటీ
బ్రెజిల్ దేశానికి తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ లో తమ పొరబాటు గానీ, తప్పిదం గానీ ఏమీ లేదని భారత్ బయో టెక్ సంస్థ స్పష్టం చేసింది.
బ్రెజిల్ దేశానికి తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ లో తమ పొరబాటు గానీ, తప్పిదం గానీ ఏమీ లేదని భారత్ బయో టెక్ సంస్థ స్పష్టం చేసింది. 324 మిలియన్ డాలర్ల వ్యయంతో 20 మిలియన్ టీకామందును కొనుగోలు చేయాలని బ్రెజిల్ ప్రభుత్వం నిర్ణయించడం..కానీ ఈ కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో బ్రెజిల్ ప్రభుత్వం ఈ డీల్ ను రద్దు చేసుకోవడం ఒకవిధంగా దుమారమే సృష్టించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని కూడా అభియోగాలు వచ్చాయి. దీనిపై అక్కడ సెనేట్ పానెల్ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అయితే ఆ దేశంతో కాంట్రాక్టులు, రెగ్యులేటరీ అనుమతులు తదితరాల విషయంలో తాము ఒకదాని తరువాత ఒకటిగా చర్యలు తీసుకుంటూ వచ్చామని భారత్ బయో టెక్ ఓ స్టేట్ మెంట్ లో వెల్లడించింది.గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది జూన్ 29 వరకు ..ఈ 8 నెలల కాలంలో వరుసగా ‘స్టెప్-బై స్టెప్’ చర్యలు తీసుకున్నామని, బ్రెజిల్ నుంచి అడ్వాన్సుగా ఎలాంటి పే మెంట్స్ తీసుకోలేదని అలాగే వ్యాక్సిన్ ని సప్లయ్ చేయలేదని ఈ సంస్థ వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతో కాంట్రాక్టులు, రెగ్యులేటరీ అప్రూవల్స్, సప్లయ్ వంటి వాటి విషయంలో ఏ విధమైన వైఖరి అవలంబిస్తామో.. బ్రెజిల్ విషయంలో కూడా అదే వైఖరి పాటించామని ఈ కంపెనీ పేర్కొంది.
ఏమైనా గత కొన్ని వారాలుగా ముఖ్యంగా బ్రెజిల్ తో బాటు ఇతర దేశాల్లో వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్ కి సంబంధించి మీడియా ‘ మిస్ రిప్రెజెంట్’ చేసిందని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఈ ప్రక్రియే కాదు…రొటీన్ ఇమ్యునైజేషన్ విషయంలో కూడా కామన్ ప్రాసెస్ పాటించడం జరుగుతుందని వెల్లడించింది. ఇది వరల్డ్ వైడ్ గా అంగీకారయోగ్యమైందని తెలిపింది. ఇండియాలో కాకుండా ఇతర దేశాలకు వ్యాక్సిన్ డోసు 15 నుంచి 20 డాలర్లు ఉందని.. ఈ ధరకు ఆయా దేశాలనుంచి తాము అడ్వాన్న్ చెల్లింపులు అందుకున్నామని భారత్ బయో టెక్ వివరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Cancer Test: ఒకే రక్త పరీక్షతో 50 రకాల కేన్సర్ లను గుర్తించే అవకాశం..ఫలితాన్నిస్తున్న పరిశోధనలు!
New TDS Rules: జులై 1 నుంచి TDS కొత్త రూల్స్.. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చెక్ చేశారా..