హై అలర్ట్..! జమ్మూ సిటీలో జామర్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు ..రాజౌరీ జిల్లాలో ఎగిరే వస్తువుల బ్యాన్

జమ్మూ లో గత ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై జరిగిన డ్రోన్ దాడితో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక్కడ పటిష్టమైన చర్యలను చేపడుతున్నారు.

హై అలర్ట్..! జమ్మూ సిటీలో జామర్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు ..రాజౌరీ జిల్లాలో ఎగిరే వస్తువుల బ్యాన్
Jammu Gets Anti Drone Syste
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 30, 2021 | 6:11 PM

జమ్మూ లో గత ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై జరిగిన డ్రోన్ దాడితో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక్కడ పటిష్టమైన చర్యలను చేపడుతున్నారు. బుధవారం ఇక్కడి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో యాంటీ డ్రోన్ సిస్టంతో బాటు జామర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, యాంటీ డ్రోన్ గన్స్ కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఈ నాలుగు రోజుల్లో ఏడు డ్రోన్లు ఎగిరినట్టు సైనికవర్గాలు తెలిపాయి, పాకిస్థాన్ ఉగ్రవాదుల పనే ఇదని అనుమానిస్తున్నారు. జమ్మూలోని కీలక సైనిక స్థావరాలకను టార్గెట్ గా చేసుకుని వరుసగా ఎటాక్ లు జరపాలన్నది వారి వ్యూహంగా ఉన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ తెల్లవారు జామున మీరాన్ సాహిబ్, కలుచౌక్-కుంజ్ వాని ఏరియాల్లో కూడా డ్రోన్లు ఎగిరాయని .. నిన్న రత్ను చౌక్-కలుచౌక్ మిలిటరీ స్టేషన్లపై కూడా రెండు మూడు డ్రోన్లు ఎగరడాన్ని చూశామని భద్రతా దళాలు వెల్లడించాయి. అటు ఈ నెల 27 న జరిగిన డ్రోన్ దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ స్థావరాన్ని టార్గెట్ చేసుకుని బహుశా మిలిటరీ గ్రేడ్ డ్రోన్లను టెర్రరిస్టులు వినియోగించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇవి చైనాలో తయారైనవని దాదాపు ధృవీకరించారు. వీటికి నైట్ విజన్, నేవిగేషన్ వ్యవస్థలను కూడా అమర్చినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా రాజౌరీ జిల్లాలో అధికారులు డ్రోన్లను, ఇతర ఎగిరే వస్తువుల వినియోగాన్ని నిషేధించారు. కాగా- యాంటీ డ్రోన్ సిస్టం కు సంబంధించి అధునాతన టెక్నాలజీని డెవెలప్ చేయాలని నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓ నోడల్ ఏజెన్సీగా పని చేయాలని కూడా తీర్మానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: బ్రెజిల్ తో కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ లో మా తప్పేమీ లేదు.. భారత్ బయో టెక్ క్లారిటీ

Cancer Test: ఒకే రక్త పరీక్షతో 50 రకాల కేన్సర్ లను గుర్తించే అవకాశం..ఫలితాన్నిస్తున్న పరిశోధనలు!

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం