New TDS Rules: జులై 1 నుంచి TDS కొత్త రూల్స్.. ఐటీఆర్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో మీరు చెక్ చేశారా..

New TDS Rules: జులై 1 వచ్చేసింది.. ప‌న్ను చెల్లింపు దారుల‌కు ముఖ్య‌మైన గమనిక... జులై నుంచి కొంత‌మంది ప‌న్ను చెల్లింపు దారుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌నుంది. వీరు డ‌బుల్ TDS క‌ట్టాల్సి రావ‌చ్చు. ఫైనాన్స్ యాక్ట్

New TDS Rules: జులై 1 నుంచి TDS కొత్త రూల్స్.. ఐటీఆర్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో మీరు చెక్ చేశారా..
New Tds Rules
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2021 | 6:00 PM

జులై 1 వచ్చేసింది.. ప‌న్ను చెల్లింపు దారుల‌కు ముఖ్య‌మైన గమనిక… జులై నుంచి కొంత‌మంది ప‌న్ను చెల్లింపు దారుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌నుంది. వీరు డ‌బుల్ TDS క‌ట్టాల్సి రావ‌చ్చు. ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్ర‌కారం గ‌త రెండేళ్ల‌లో TDS చెల్లించ‌ని వారు, ప్ర‌తి సంవ‌త్స‌రం TDS రూ.50వేలు దాటినవారు జులై 1 నుంచి ఐటీఆర్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద ఎక్కువ చార్జీ వ‌సూలు చేస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమ‌లులోకి రానుంది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులను దాఖ‌లు చేసే వారి సంఖ్య పెంచ‌డానికి వీలుగా ఇటీవ‌ల బ‌డ్జెట్లో కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను తీసుకువచ్చింది.

TDS అంటే…

TDS అంటే.. మీరు పొందుతున్న ఆదాయం మూలం వ‌ద్ద‌నే ప‌న్ను వ‌సూలు చేయ‌డం. ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌రోక్షంగా ఉద్యోగుల నుంచి ప‌రోక్షంగా ఆదాయ‌పు ప‌న్ను వ‌సూలు చేయడం అని అర్థం. మీరు ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే మీ ఆదాయం ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధి కంటే అధికంగా ఉంటే మీ యాజ‌మాన్యం మీ వ‌ద్ద టీడీఎస్ వ‌సూలు చేస్తారు.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం..

ఇందుకోసం ఫైనాన్స్ యాక్ట్ ద్వారా సెక్ష‌న్ 206AB, 206CCAల‌ను ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లో చేర్చారు. ఈ కొత్త పంక్ష‌న్ ద్వారా సెక్ష‌న్ 206AB, 206CCA కింద‌కి వచ్చే ప్ర‌త్యేక వ్య‌క్తుల‌ను టీడీఎస్ వ‌సూలు చేసే వారు సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఈ పంక్ష‌న్  ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిపోర్టింగ్ పోర్ట‌ల్ ద్వారా ఇప్ప‌టికే ప‌నిచేస్తుందని CBDT వెల్ల‌డించింది.  ఈ న్యూ పోర్ట‌ల్ లో గ‌త రెండేళ్ళుగా ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు అయింది లేనిదీ ప‌రిశీలించుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌వ‌చ్చు.

ప‌న్ను వ‌సూలు చేసే వారు.. ఒక వ్య‌క్తిని పత్యేక వ్యక్తి అవునా.. కాదా.. అని తెలుసుకునేందుకు అత‌ని PAN నెంబ‌రును పోర్ట‌ల్‌లో న‌మోదు చేయాల్సి ఉంటుంది. PAN నెంబ‌రు ఆధారంగా చెక్ చేసి పత్యేక వ్యక్తి అవునా కాదా తెలియ‌జేస్తుంది. దీన్ని పీడీఎఫ్ ఫార్మెట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఇవి కూడా చదవండి : Revanth Reddy: నేను సోనియాగాంధీ మనిషిని.. కాంగ్రెస్ బిడ్డను..ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..

High alert: ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో హై అలర్ట్.. నిఘా పెంచిన ప్రత్యేక పోలీస్ బలగాలు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే