ఆ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా లేదట..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విజృంభిస్తోంది. అయితే, గోవాలో కోవిడ్-19 రోగులంతా కోలుకున్నారని, తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఆదివారం తెలిపారు.

ఆ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా లేదట..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 7:33 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విజృంభిస్తోంది. అయితే, గోవాలో కోవిడ్-19 రోగులంతా కోలుకున్నారని, తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఆదివారం తెలిపారు. చిట్టచివరిగా ఏడుగురికి ఈ నెల 3న కోవిడ్-19 పాజిటివ్ నిర్థరణ అయిందని, వెంటనే వారందరికీ చికిత్స అందజేశామని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ ఏడుగురికి కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినట్లు ప్రకటించారు.

కాగా.. గోవాలో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థరణ అయినవారంతా కోలుకోవడం తమకు గర్వకారణమని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసులు సున్నా అని తెలిపారు. సున్నాకు నిజంగా చాలా విలువ ఉందన్నారు. కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న తమ రాష్ట్ర వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, నర్సులు తదితరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వీరంతా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.

Also Read: థియేటర్లు బంద్.. ఓటీటీల హవా..