18-44ఏళ్ళ మధ్య వయస్సు వారికే కోవాగ్జిన్ వ్యాక్సిన్…..అది కూడా రెండో డోసు మాత్రమే ! ఢిల్లీ సర్కార్ ఆదేశం

వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో కొత్త పంథా అనుసరిస్తోంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారిలో రెండో డోసు అవసరమైనవారికే కోవాగ్జిన్ టీకామందు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

18-44ఏళ్ళ మధ్య వయస్సు వారికే కోవాగ్జిన్ వ్యాక్సిన్.....అది కూడా రెండో డోసు మాత్రమే ! ఢిల్లీ సర్కార్ ఆదేశం
Corona Vaccine
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 07, 2021 | 11:27 AM

వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో కొత్త పంథా అనుసరిస్తోంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారిలో రెండో డోసు అవసరమైనవారికే కోవాగ్జిన్ టీకామందు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడత తీసుకోవలసినవారిని తిప్పి పంపివేయాలని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్ లను ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. మా వద్ద ఈ టీకామందు స్టాక్ లేదు.. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం అని వారు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా స్టాక్ లేదని, ఈ కారణంగా మొదటి డోసు తీసుకోగోరేవారికి ఛాన్స్ లేదని అంటున్నారు. ముఖ్యంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఓ వ్యూహాన్ని పాటించాలని ఢిల్లీ హైకోర్టు గతవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యాక్సినేషన్ విధానంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది. గత మే నెలలో మొదటి డోసు తీసుకున్నవారు ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్కులు వ్యాక్సిన్ తీసుకోవడానికి 100 నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న మీరట్, బులంద్ షహర్ వంటి జిల్లాలకు కూడా వెళ్తున్నారని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు.

కాగా వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సమర్థించుకోగా.. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండు వారాల్లోగా ఈ పాలసీపై తమ నూతన వైఖరి తెలియజేయాలని సూచించింది. ఇప్పటికే నగరంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలాసార్లు కేంద్రం దృష్టికి తెచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మ పట్టుకున్న మహిళ… రెస్క్యూ టీం తెగువ.. ( వీడియో )

Aarogya Setu New Feature: ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేష‌న్ వివ‌రాలు.. డ‌బుల్ టిక్స్‌తో

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..