ఇక కోవిద్-19 ఆస్పత్రిగా నిమ్స్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిమ్స్ ఆస్పత్రిని కోవిద్ ఆస్పత్రిగా మార్చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

  • Tv9 Telugu
  • Publish Date - 1:47 pm, Sun, 7 June 20
ఇక కోవిద్-19 ఆస్పత్రిగా నిమ్స్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిమ్స్ ఆస్పత్రిని కోవిద్ ఆస్పత్రిగా మార్చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై నిమ్స్‌లో వీఐపీలు, వైద్యులకు కరోనా చికిత్స అందివ్వనున్నారు. ప్రస్తుతం రెండు వార్డుల్లో మాత్రమే సేవలు.. రెండ్రోజుల్లో 200 పడకలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్పీఆర్‌ బ్లాక్‌లో కరోనా చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమ్స్‌లో ఓపీ, ఇతర వైద్య సేవలు ప్రస్తుతానికి నిలిపివేశారు.

కాగా.. గత కొద్ధి రోజులుగా నిమ్స్ ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ 150 వెంటిలేటర్లు, 300 ఆక్సిజన్ పోర్టులు అందుబాటులో ఉండటంతో నిమ్స్ ను కోవిద్-19 ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. కొత్త అడ్మిషన్లను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.