కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నవదంపతుల దుర్మరణం

ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరిగి ఇంటికి చేరుకుంటుండగా మృత్యురూపంలో వచ్చిన వాహనం వారిని అనంతలోకాలకు పంపింది.

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నవదంపతుల దుర్మరణం
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 11, 2020 | 3:31 PM

ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరిగి ఇంటికి చేరుకుంటుండగా మృత్యురూపంలో వచ్చిన వాహనం వారిని అనంతలోకాలకు పంపింది. పెళ్లైన గంటల వ్యవధిలోనే వారిని మృతువు వెంటాడింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గుర్తు తెలియని వాహనం డీకొని నవదంపతులు మృత్యువాతపడ్డారు. సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం పాలయ్యారు. సదాశివనగర్ మండలం మొడేగాం గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, టాకూర్ మహిమ లు ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు నుండి వస్తుండగా జూనియర్ కళాశాల వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిమ సంఘటనా స్థలంలో మృతి చెందగా, తీవ్రంగా ప్రభాకర్‌ను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. వీరు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని తిరిగి స్వస్థలానికి వస్తుండగా సంఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.