బ్రెజిల్‌లో కొత్త వైరస్.. కరోనా.. అంతకుమించి..
New Virus In Brazil: మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాయి. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారిన పడి 1000 మందికి పైగా మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 44,000 కేసులు నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌లోని ఓ సరస్సులో దీన్ని గుర్తించగా.. మత్య్స కన్య ‘యారా’కు గుర్తుగా ఆమె పేరుని ఈ వైరస్‌కు పెట్టారు. బెలో […]
New Virus In Brazil: మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాయి. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారిన పడి 1000 మందికి పైగా మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 44,000 కేసులు నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌లోని ఓ సరస్సులో దీన్ని గుర్తించగా.. మత్య్స కన్య ‘యారా’కు గుర్తుగా ఆమె పేరుని ఈ వైరస్‌కు పెట్టారు.
బెలో హరిజాంట్ నగరంలోని పాంపుల్హా ప్రాంతంలో కలుషిత జలాలతో ఏర్పడిన కృత్రిమ సరస్సులో బ్రెజిల్స్ ఫెడరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వారి బృందం దీన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ అమీబాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ సుమారు 74 జన్యువుల సదుపాయంతో వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. కాగా, యారా వైరస్ మానవులకు సోకకపోవచ్చునని జెరాయిస్ తెలిపారు.