ఆ కార్డుల కాలం చెల్లింది.. కొత్త బియ్యం కార్డులొస్తున్నాయి…
New Ration Cards Issued: జాతీయ ఆహార భద్రత చట్టం–2013 పేరిట జగన్ సర్కార్ కొత్తగా జారీ చేయనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయ్యింది. ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్దిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సుమారు 1.47 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలోనే ఈ కొత్త […]
New Ration Cards Issued: జాతీయ ఆహార భద్రత చట్టం–2013 పేరిట జగన్ సర్కార్ కొత్తగా జారీ చేయనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయ్యింది. ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్దిదారులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సుమారు 1.47 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలోనే ఈ కొత్త కార్డులను ఇవ్వనున్నారు. ఇక ఈ కార్డులపైన కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటోకి బదులు కేవలం కార్డు జారీ అయిన లబ్దిదారుడి ఫోటో మాత్రమే ఉంటుంది.
ఇదిలా ఉంటే కార్డులో నమోదైన మిగిలిన కుటుంబ సబ్యులకు వేరువేరుగా ఐడీ నెంబర్లు ఇచ్చారు. అంతేకాకుండా రేషన్ డీలర్ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. అటు కార్డుపై తెలుగు, ఇంగ్లీష్‌లలో వివరాలున్నాయి. ఇక ఇప్పటివరకు రేషన్ కార్డుల్లో కేవలం కుటుంబ సభ్యుల వయసు మాత్రమే ఉండేది. కానీ ఈ కొత్త కార్డుల్లో ఏజ్‌తో పాటుగా పుట్టిన తేదీని కూడా ముద్రించారు. కాగా, లబ్దిదారులకు సరుకులు అందకపోతే చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్లు 1902 / 1967 / 18004250082ను సైతం వాటిపై ముద్రణ చేశారు.