టెన్నిస్ బాల్.. బాలుడి ప్రాణం తీసింది…
Transformer Current Shock: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బాల్ తీసుకొచ్చే క్రమంలో ఓ బాలుడు కరెంట్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న యాదమ్మ, శేఖర్ దంపతుల కుమారుడు అఖిల్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ బంతిని పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కనే ఎఫ్‌ఎన్‌సీసీ టెన్నిస్ కోర్టులో వృధాగా పడి ఉన్న […]
Transformer Current Shock: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బాల్ తీసుకొచ్చే క్రమంలో ఓ బాలుడు కరెంట్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న యాదమ్మ, శేఖర్ దంపతుల కుమారుడు అఖిల్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ బంతిని పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పక్కనే ఎఫ్‌ఎన్‌సీసీ టెన్నిస్ కోర్టులో వృధాగా పడి ఉన్న బంతులను తెచ్చుకుందామని ఎమ్మార్సీ కాలనీ వైపునున్న గోడ ఎక్కేందుకు ప్రయత్నించాడు.
ఇక అఖిల్ బంతులను తీసుకొచ్చే క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కరెంట్ తీగలకు తగలడంతో.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కొడుకు మరణంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.