భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం..గొంతుకోసి టీచర్ హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలంలో ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిని అర్థరాత్రి గొంతుకోసి చంపేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని లచ్చి గూడెం గ్రామానికి నివశించే రామకృష్ణ కారం స్థానిక గవర్నమెంట్ స్కూల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అతికిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. అడ్డుకోబోయిన మృతుడి భార్య తులసిని కూడా గాయపరిచి..అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ ప్రారంభించారు. […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలంలో ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిని అర్థరాత్రి గొంతుకోసి చంపేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని లచ్చి గూడెం గ్రామానికి నివశించే రామకృష్ణ కారం స్థానిక గవర్నమెంట్ స్కూల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడు రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అతికిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. అడ్డుకోబోయిన మృతుడి భార్య తులసిని కూడా గాయపరిచి..అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ ప్రారంభించారు. కాస్త ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.