తెలంగాణ… ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు… అమావాస్య ఎఫెక్ట్… తొలి రోజు ఎన్నంటే…

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 141 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా... కేవలం 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

తెలంగాణ... ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు... అమావాస్య ఎఫెక్ట్... తొలి రోజు ఎన్నంటే...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 15, 2020 | 8:43 AM

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 141 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా… కేవలం 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం సోమవారానికి 107 స్లాట్‌లు బుక్‌ చేసుకున్నా సంబంధింత వ్యక్తులు రాకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఏడురకాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వగా అమ్మకం (సేల్‌డీడ్‌) రిజిస్ట్రేషన్లే ఎక్కువగా జరిగాయి. సోమవారం అమావాస్య కావడంతో తక్కువమందే స్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల సర్వర్‌ సమస్యలతో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తయ్యాయి. రికార్డుల్లో పేరు మార్పు (మ్యుటేషన్‌) కూడా వెంటవెంటనే పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే డాక్యుమెంట్‌, ఈ-పాస్‌ పుస్తకాన్ని కొనుగోలుదారులకు అందజేశారు.

ఆ స్థలాల రిజిస్ట్రేషన్ ఎప్పుడు?

ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌కు డిసెంబర్ 14న అవకాశం కల్పించలేదు. రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లలో అత్యధికం ఇలాంటివే ఉంటాయి. వీటికి అవకాశం ఇస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్లాట్లకు కూడా వెంటనే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్లాట్‌ బుకింగ్‌ వద్దే సమస్యలు వస్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేచోట ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యధిక సేవలకు స్లాట్‌ బుక్‌ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్