Exclusive: కేంద్రం వైఖరిపైనే రైతుల రియాక్షన్.. తాజా చర్చలపై కర్షక ప్రతినిధి నరేశ్ టికాయత్ కీలక వ్యాఖ్యలు
New Farm Laws: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
New Farm Laws: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో ఆరోసారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ టికైట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
”వ్యవసాయ చట్టాలపై కేంద్రం రెండు అడుగులు వెనక్కి తగ్గితే.. రైతులు రెండున్నర అడుగులు వెనక్కి వేస్తారు. అయితే ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తల వంచరు. అలాగే రైతులు కూడా తల వంచరు” అని నరేష్ టికైట్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంతో జరుగుతున్న చర్చలో పరిష్కారం దొరుకుతుందని నరేష్ టికైట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా చెప్పినట్లు కేంద్రం రెండు అడుగులు వెనక్కి వేస్తేనే.. రైతులు రెండున్నర అడుగులు వెనక్కి వేస్తారని చెప్పుకొచ్చారు. తాము ఉద్యమంలో పాల్గొంటున్న మొత్తం 40 సంస్థలకు కాస్త శాంతించమని చెప్పామని.. రైతుల చేస్తున్న ఉద్యమంపై పలు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయని.. ఆ అపవాదు తమకు వద్దని.. గౌరవం కావాలని టికైట్ అన్నారు.
Also Read:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!