రేపు ఢిల్లీలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమే అధిష్టానం రాష్ట్ర నాయకులకు ప్రాధాన్యత కల్పించిందన్నారు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. సోమవారం ఢిల్లీలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మణ్ టీవీ9తో తెలంగాణలో పార్టీ పరిస్థితులపై మాట్లాడారు. తాను రాజ్యసభ ఆశించి భంగపడ్డానన్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సాధారణ స్థాయి కార్యకర్త నుండి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో కీలక సభ్యునిగా పని చేసే అవకాశం పార్టీ తనకు […]

రేపు ఢిల్లీలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2020 | 2:53 PM

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమే అధిష్టానం రాష్ట్ర నాయకులకు ప్రాధాన్యత కల్పించిందన్నారు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. సోమవారం ఢిల్లీలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మణ్ టీవీ9తో తెలంగాణలో పార్టీ పరిస్థితులపై మాట్లాడారు. తాను రాజ్యసభ ఆశించి భంగపడ్డానన్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సాధారణ స్థాయి కార్యకర్త నుండి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో కీలక సభ్యునిగా పని చేసే అవకాశం పార్టీ తనకు కల్పించిందని తెలిపారు. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు కూడా పార్టీ నామీద నమ్మకంతోనే అప్పగించిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీలు మోదీ మీద నమ్మకంతోనే ప్రధానిగా అవకాశం ఇచ్చారని అన్నారు. బిసిల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. తెలంగాణ లో వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్న లక్ష్మణ్.. ముస్లింలను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.