నెల రోజుల తరువాత చీరను మార్చిన నటి

హిందీ సీరియళ్లు చూసే వారికి శ్రద్ధా ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ నటి కుండలి భాగ్యలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

నెల రోజుల తరువాత చీరను మార్చిన నటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 3:02 PM

Shraddha Arya Saree: హిందీ సీరియళ్లు చూసే వారికి శ్రద్ధా ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ నటి కుండలి భాగ్యలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక అందులో కథానుగుణంగా ఆమెను కిడ్నాప్ చేసి ఒక చోట ఉంచారు. ఇలా దాదాపు నెల రోజులుగా కిడ్నాప్‌ల దగ్గరే ఉంటుంది. దీంతో ఒక చీరను అన్ని రోజులు కట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఆ ఎపిసోడ్‌ ముగియడంతో ఆ చీరను మార్చేసింది. ఈ క్రమంలో లైట్‌ బ్లూ కలర్‌ శారీని కట్టుకున్న ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానికి నెల రోజుల తరువాత చీరను మార్చితే అని కామెంట్ పెట్టారు. ఇక మరో వీడియోలో శ్రద్ధాను ఆమె సహ నటుడు వెంటాడుతూ కనిపించారు. కాగా శ్రద్ధా ఆర్య తెలుగులో గొడవ, కోతి మూక, రోమియో చిత్రాల్లో నటించారు. అలాగే, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ మెరిశారు.

Read More:

రిక్కీ మాటలకు పంత్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో మోహన్ బాబు..!

https://www.instagram.com/p/CGXRc69Arpk/?utm_source=ig_embed