ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో మోహన్ బాబు..!

టాలీవుడ్‌లో రీమేక్‌లు కొత్తేం కాదు. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్‌లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు పలువురు యంగ్ హీరోలు రీమేక్‌లకు ఓకే చెబుతున్నారు

ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో మోహన్ బాబు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 1:51 PM

Mohan Babu Malayal remake: టాలీవుడ్‌లో రీమేక్‌లు కొత్తేం కాదు. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్‌లు పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు పలువురు యంగ్ హీరోలు రీమేక్‌లకు ఓకే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

మాలీవుడ్‌లో రతీష్‌ బాలకృష్ణన్‌ పొదువల్‌ తెరకెక్కించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఇక ఇందులో నటించేందుకు విలక్షణ నటుడు మోహన్ బాబు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా సైన్స్‌ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25లో సూరజ్ వెంజారమోద్‌, సౌబిన్ సాహిర్, కెండీ జిర్దో, సైజు కిరు తదితరులు కీతక పాత్రల్లో కనిపించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం మలయాళంలో పెద్ద విజయం సాధించింది. ఈ మూవీకి కేరళ ప్రభుత్వం నుంచి మూడు అవార్డులు కూడా లభించాయి. ఇటీవల ఈ మూవీ తెలుగు వెర్షన్ అహాలో విడుదలైన విషయం తెలిసిందే.

Read More:

ఇటలీకి వెళ్లనున్న ‘రంగ్‌ దే’ టీమ్‌..!

మళ్లీ ఆగిన ‘టక్ జగదీష్’‌ షూటింగ్..!