ఇటలీకి వెళ్లనున్న ‘రంగ్ దే’ టీమ్..!
నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్ దే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా
Rang De shooting: నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్ దే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా.. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఇక తదుపరి చిత్రీకరణ కోసం టీమ్ ఇటలీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25న రంగ్ దే టీమ్ ఇటలీకి వెళ్లనుందని టాక్. అక్కడ పాటలతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నరేష్, రోహిణి, బ్రహ్మాజీ, కౌసల్య, వెన్నెల కిశోర్, వినీత్, గాయత్రి రఘురామ్, సత్యం రాజేష్ తదితరుల కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read More: