‘ఖిలాడి’గా రవితేజ.. మరో మూవీని ప్రకటించిన మాస్‌రాజా

మాస్‌రాజా రవితేజ మరో మూవీని ప్రకటించారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడిగా రవితేజ కనిపించబోతున్నారు.

'ఖిలాడి'గా రవితేజ.. మరో మూవీని ప్రకటించిన మాస్‌రాజా
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 12:40 PM

Ravi Teja Khiladi movie: మాస్‌రాజా రవితేజ మరో మూవీని ప్రకటించారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడిగా రవితేజ కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు ఓ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. ఆయన సరసన డింపుల్‌ హయతీ, మీనా చౌదరి నటించనున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇవాళ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం..  వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

కాగా ప్రస్తుతం రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌లో నటిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శ్రుతీహాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, సముద్రఖని, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

రికార్డు సృష్టించిన అనుష్క ‘నిశ్శబ్దం’..!