మళ్లీ ఆగిన ‘టక్ జగదీష్’ షూటింగ్..!
నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం టక్ జగదీష్. లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది
Tuck Jagadish movie: నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం టక్ జగదీష్. లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఆగిపోయిందట. మూవీ యూనిట్‌లో ఓ సాంకేతిక నిపుణుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా షూటింగ్‌ని నిలిపివేసినట్లు సమాచారం. ఇక టక్ జగదీష్ టీమ్ మొత్తం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే వీరు కరోనా పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.
కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సాహు గారాపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. నిన్ను కోరి తరువాత నాని, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read More: