పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు

పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 11:35 AM

Telangana DGP News: తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్‌ఛార్జి జయేష్‌ రంజన్‌ మహేందర్ రెడ్డికి పీహెచ్‌డీ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంపాక్ట్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగంపై పదేళ్లుగా తాను అధ్యయనం చేసినట్లు తెలిపారు. తాను పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read More:

రికార్డు సృష్టించిన అనుష్క ‘నిశ్శబ్దం’..!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,436 కొత్త కేసులు.. 6 మరణాలు