ఏలూరు వింత వ్యాధిపై జాతీయ పోషకాహార సంస్థ నివేదిక, కీలక విషయాలు వెల్లడి

ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి వివిధ విభాగాలకు చెందిన జాతీయ నిపుణులు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్నారు.

ఏలూరు వింత వ్యాధిపై జాతీయ పోషకాహార సంస్థ నివేదిక, కీలక విషయాలు వెల్లడి
Follow us

|

Updated on: Dec 11, 2020 | 6:36 PM

Mystery illness in Eluru: ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి వివిధ విభాగాలకు చెందిన జాతీయ నిపుణులు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని తాగునీరు,  ఫుడ్, చేపులు, రొయ్యలు, పాలు, వాతావరణం వంటి వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. బాధితుల రక్త నమూనాల్లో భార లోహలైన సీసం, నికెల్ బయటపడటంతో ఏలూరు పరిసరాల్లో పరిశ్రమలను తనిఖీ చేశారు. కూరగాయలు, తాగునీటిలో ఆర్గనో క్లోరిన్స్ వెలుగు చూడటంతో పరిసరాల్లోని పురుగుమందుల దుకాణాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

తాజాగా జాతీయ పోషకాహార సంస్థ తన నివేదికలో కీలక అంశాలు వెల్లడించింది.  36 తాగునీటి శాంపిల్స్ పరిశీలించగా మూడింటిలో లెడ్, మూడింటిలో నికిల్ మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది.  36 శాంపిల్స్ లోనూ మెర్కురీ మోతాదు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. ఆర్గానో క్లోరిన్ ఎక్కడా బయటపడలేదని తెలిపింది. అన్నంలో మెర్కురీ మోతాదు అధికంగా ఉండటాన్ని గుర్తించామని తెలిపింది.  కూరగాయలని పరిశీలిస్తే ప్రమాదకరమైన ఆర్గానో ఫాస్పరస్ ఎక్కువగా కనిపించిందని పేర్కొంది.  40 బ్లడ్ శాంపిల్స్ పరిశీలిస్తే 36 శాంపిల్స్ లో ఆర్గానో ఫాస్ఫరస్ మోతాదు అత్యధికంగా ఉందని, అర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదని వివరించింది. గతంలో ఆక్వాకల్చర్ వల్ల ఈ తరహాలో కేసులు చైనాలో బయటపడినట్లు అభిప్రాయపడింది.  తాగునీటి కలుషితం వల్ల కూడా అవకాశం ఉండచ్చని వెల్లడించింది.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..

Latest Articles