Bigg Boss 4: లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఈసారి బిగ్ బాస్ దత్తపుత్రిక హౌస్ నుంచి బయటికి రానుందా.?

Bigg Boss 4: బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం ఫైనల్‌కు చేరిన అఖిల్ తప్ప అందరూ..

Bigg Boss 4: లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఈసారి బిగ్ బాస్ దత్తపుత్రిక హౌస్ నుంచి బయటికి రానుందా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2020 | 6:31 PM

Bigg Boss 4: బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం ఫైనల్‌కు చేరిన అఖిల్ తప్ప అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకునేసరికి ఎవరికి వారు తమ 100 శాతం ఎఫర్ట్స్‌ను టాస్క్‌ల్లో పెట్టి అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ దత్తపుత్రిక, గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్‌లోకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఆమె.. ఎక్కువగా అభిజిత్-అఖిల్ గొడవల మధ్య కేంద్ర బిందువుగా మారింది. షో చివరి వారాల్లో తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ.. హారిక హౌస్ కెప్టెన్ కావడంలో సహాయసహకారాలు అందించి ప్రేక్షకుల మనసులు దోచేసింది. పలుసార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా అదృష్టం కలిసొచ్చి అవరోధాలన్నింటి దాటుకుని చివరి వరకు చేరుకుంది.

ఇక తాజాగా షో చివరి దశకు చేరుకోవడం.. పైగా కొద్దిరోజులుగా హౌస్‌లో జరుగుతున్న పలు గొడవలకు ఆమె కారకురాలు కావడంతో ప్రేక్షకులు మోనాల్‌ను ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారు. అంతేకాక కొన్ని అనధికారిక పోల్స్‌ను పరిశీలిస్తే.. మోనాల్‌కు తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే మరోసారి అభిజిత్ ఈవారం కూడా ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అరియానా, సోహైల్, హారికలు ఉన్నారు. మరి ఈ వారం నిజంగా మోనాల్ ఎలిమినేట్ కానుందా.? లేదా.? తెలియాలంటే వీకెండ్ దాకా వేచి చూడాల్సిందే.

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్