AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Saving: ఆక్సిజన్ సిస్టర్స్‌ చొరవతో ప్రాణ‌వాయువు ఆదా.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సేవింగ్.. ఎక్క‌డంటే

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విలయతాండవానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో ఊపిరాడక ఆసుపత్రుల్లో చనిపోతున్న వారి వార్తలు విన్నప్పుడల్లా మనసు కలచివేస్తుంది.

Oxygen Saving: ఆక్సిజన్ సిస్టర్స్‌ చొరవతో ప్రాణ‌వాయువు ఆదా.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సేవింగ్.. ఎక్క‌డంటే
Saving Oxygen
Ram Naramaneni
|

Updated on: May 10, 2021 | 5:54 PM

Share

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విలయతాండవానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో ఊపిరాడక ఆసుపత్రుల్లో చనిపోతున్న వారి వార్తలు విన్నప్పుడల్లా మనసు కలచివేస్తుంది. ఆక్సిజన్ సరఫరా చేయాలని చాలా హాస్పిటల్స్‌ ప్రభుత్వాలను కోరుతున్నాయి. అయితే మహారాష్ట్రలోని గిరిజన జిల్లా నందూర్‌బార్‌లో ఆక్సిజన్‌ కొరత లేదు. జిల్లా ఆసుపత్రిలోని నర్సులకే కొత్త బాధ్యతలు అప్పగించడంతో ఆక్సిజన్‌ సమస్యన్నదే ఇక్కడ కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్‌ ఓ డాక్టర్‌. అతని ఆలోచనకి స్థానిక అధికారుల సాయం తోడైంది. తగినంత ఆక్సిజన్‌ నిల్వ చేయడం కన్నా ఉన్న దాన్ని సద్వినియోగం చేయాలన్న విషయంపై ఆలోచన చేసారు. ఆక్సిజన్‌ ఎలా వృథా అవుతుందో ముందుగా గుర్తించారు. రోగికి ప్రతీసారీ ఒకే స్థాయిలో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తక్కువ మోతాదులో ఇస్తే సరిపోతుంది. అలాంటప్పుడు మీటను కొంచెం తిప్పితే తక్కువ మొత్తంలో ఆక్పిజన్ వెళ్లే అవకాశం ఉంది. పేషంట్‌ భోజనం చేస్తున్నప్పుడో బాత్రూమ్‌కు వెళ్ళినప్పుడో ఆక్సిజన్‌ సిలిండర్‌ను స్విచాఫ్‌ చేయడం లేదు.

ఆక్సిజన్ వృథా కాకుండా చూసే బాధ్యతలను కొందరు నర్సులకు అప్పగించారు. వారికి ఆక్సిజన్‌ సిస్టర్స్‌ అని పేరు పెట్టారు. 20 పడకలకు ఒక నర్సును ఏర్పాటు చేసారు. రోగికి ఎంత ఆక్సిజన్ అవసరమో అంతే సరఫరా అయ్యేలా చూడడం వారి బాధ్యత. నందుర్‌బార్ జిల్లా ఆసుపత్రిలో 240 పడకలున్నాయి. ఆక్సిజన్ సిస్టర్స్‌ చొరవతో ఆక్సిజన్‌ వృథా కావడం నిలిచిపోయింది.

Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..