AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బాధితుడిపై.. ఇరు రాష్ట్రాల ఫైట్!

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీని కట్టడికోసం ఓ వైపు దేశం యావత్తూ పోరాడుతుండగా... కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని అధికారికంగా గుర్తించేందుకు రెండు

కరోనా బాధితుడిపై.. ఇరు రాష్ట్రాల ఫైట్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 8:15 PM

Share

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీని కట్టడికోసం ఓ వైపు దేశం యావత్తూ పోరాడుతుండగా… కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని అధికారికంగా గుర్తించేందుకు రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య కుమ్ములాట మొదలైంది. అతడి బాధ్యత మాది కాదంటే మాది కాదంటూ నాగాలాండ్, అసోం అధికార వర్గాలు భీష్మించడంతో ఇంత వరకు అతడిని రికార్డుల్లోకి ఎక్కించలేదు.

వివరాల్లోకెళితే.. నాగాలాండ్‌లోని దిమాపూర్‌కి చెందిన 33 ఏళ్ల ఓ వ్యక్తికి ఆరోగ్యం విషమించడంతో నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రి సూచన మేరకు అతడిని అసోంలోని గువహటి మెడికల్ కాలేజి ఆస్పత్రి (జీఎసీహెచ్‌)లో చేర్పించారు. అయితే ఈ నెల 12న అతడు చేరిన కొద్ది గంటలకే కరోనా పాజిటివ్ ఉన్నట్టు జీఎంసీహెచ్ నిర్ధారించింది. అయితే ఈ విషయం తెలిసి కూడా ఇటు అసోంగానీ, అటు నాగాలాండ్ గానీ అధికారికంగా అతడి పేరు రికార్డుల్లో నమోదు చేయలేదు.

కాగా.. అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విటర్లో వెల్లడించిన కరోనా లెక్కల్లో అతడిని కలపలేదు సరికదా.. తన ట్వీట్లను శర్మ సమర్థించుకున్నారు. మరోవైపు నాగాలాండ్ ముఖ్యమంత్రి నైపు రియో మాట్లాడుతూ.. ‘‘అతడిని లెక్కించే బాధ్యత అసోంకి సంబంధించినదైతే నేను మాట్లాడడం సరికాదు. నాగాలాండ్ కేసుగా నమోదు చేయకపోవడంపై మమ్మల్ని నిందించినా స్వీకరించబోను..’’ అని తేల్చి చెప్పారు.‘‘అతడికి కరోనా ఉన్నట్టు అసోంలో గుర్తించారు కాబట్టి అక్కడే రికార్డు చేయడం సముచితం. లేదా అతడిని నాగాలాండ్ పంపిస్తే ఇక్కడే మేము రికార్డుల్లో నమోదు చేస్తాం..’’ అని నాగాలాండ్ సీఎం వివరించారు.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?