‘అమానుషం..అసమంజసం’…. ఉద్యోగులకు డీఏ పెంపు కోతపై రాహుల్ ఫైర్

ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు డీఏ, డియర్ నెస్ రిలీఫ్ పెంపుదలను నిలిపివేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది అమానుషమని, అసమంజసమని విమర్శించారు. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు, సెంట్రల్ విస్తా బ్యూటిఫికేషన్ ప్రాజెక్టువంటి వాటిని నిలిపివేయడం ద్వారా ఆదా అయ్యే కోట్లాది రూపాయలను ఉద్యోగుల ప్రయోజనాల కోసం వినియోగించవచ్ఛునని ఆయన ట్వీట్ చేశారు. కరోనా ప్రభావం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ ‘కుంగుతున్న’ తరుణంలో కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులందరి డీఏ, రిలీఫ్ పెంపుదలను […]

'అమానుషం..అసమంజసం'.... ఉద్యోగులకు డీఏ పెంపు కోతపై రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 24, 2020 | 8:13 PM

ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు డీఏ, డియర్ నెస్ రిలీఫ్ పెంపుదలను నిలిపివేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది అమానుషమని, అసమంజసమని విమర్శించారు. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు, సెంట్రల్ విస్తా బ్యూటిఫికేషన్ ప్రాజెక్టువంటి వాటిని నిలిపివేయడం ద్వారా ఆదా అయ్యే కోట్లాది రూపాయలను ఉద్యోగుల ప్రయోజనాల కోసం వినియోగించవచ్ఛునని ఆయన ట్వీట్ చేశారు. కరోనా ప్రభావం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ ‘కుంగుతున్న’ తరుణంలో కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులందరి డీఏ, రిలీఫ్ పెంపుదలను నిలిపివేసింది. దీనివల్ల మొత్తం 1.2 లక్షల కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది.