AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ బ్యాన్.. అప్పటి వరకు ట్రాన్స్‌ఫర్స్‌కు నో!

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం విధించింది. జూన్ 1, 2026 నుంచి బదిలీలకు అనుమతి లేదని జీఓ 57 ద్వారా స్పష్టం చేసింది. దీంతో వచ్చే ఆరు నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మే నెలలో నిర్వహించిన బదిలీల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

Telangana: తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ బ్యాన్.. అప్పటి వరకు ట్రాన్స్‌ఫర్స్‌కు నో!
Telangana Govt Imposes Ban On Employee Transfers
Srilakshmi C
|

Updated on: Jun 01, 2026 | 3:02 PM

Share

హైదరాబాద్‌, జూన్ 1: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై మళ్లీ సర్కార్ బ్యాన్ విధించింది. జూన్ 1 నుంచి మొదలవనున్న ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లకు నో చెప్పింది. ఈ మేరకు జీఓ 57 విడుదల చేసింది. దీంతో వచ్చే ఆరు నెలల పాటు బదిలీలపై కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. దీనికి ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 మధ్య బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అనూహ్యంగా జూన్ 1 నుంచి సాధారణ బదిలీలపై తిరిగి ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ రేవంత్‌ సర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో వచ్చే ఆరు నెలల పాటు సాధారణ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రత్యేక పరిపాలనా అవసరాలు లేదా ప్రభుత్వ అనుమతితో జరిగే బదిలీలకు మాత్రం మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. మే నెలలో బదిలీ పొందని ఉద్యోగులు తదుపరి సడలింపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us