AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: నేటి నుంచి అమల్లోకి కొత్త నిర్ణయం.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు.. దేశ ప్రజలకు ఊరట..

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒమన్‌తో జరిగిన ట్రేడ్ డీల్ నేటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ఒమన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలో మినహాయింపులు ఇవ్వనుంది. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారానికి ఇది ప్రయోజనం చేకూరనుంది.

Central Government: నేటి నుంచి అమల్లోకి కొత్త నిర్ణయం.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు.. దేశ ప్రజలకు ఊరట..
Oman
Venkatrao Lella
|

Updated on: Jun 01, 2026 | 3:19 PM

Share

భారత్-ఒమన్ దేశాల మధ్య కీలక ట్రేడ్ డీల్ జరిగింది. ఒమన్ నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులకు కస్టమ్స్ సుంకం రాయితీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్ధికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒమన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులు అమల్లో ఉంటాయిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సుదీర్ఘ సమయం తర్వాత ఇప్పటినుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరగడంతో పాటు రెండు దేశాలకు ప్రయోజనం కలగనుంది. దిగుమతిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుందని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి.

ఏయే వస్తువులకు ప్రయోజనం అంటే..?

ఒమన్ నుంచి ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్ వస్తువులతో సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో అక్కడ నుంచి భారత్ దిగుమతి చేసుకునే 94.81 శాతం వస్తువులకు కస్టమ్స్ సుంకంలో మినహాయింపులు లభించనున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సులభతరం కానుంది. అయితే మినహాయింపు పొందేందుకు కొన్ని షరతులు విధించారు. ఒమాన్ నుండే వస్తువులు వచ్చాయని దిగుమతిదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పలు ఆధారాలు చూపించాల్సి ఉంటుంని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒమన్ నుంచి వస్తువులను తీసుకొచ్చినట్లు అవసరమైన పత్రాలను కస్టమ్స్ అధికారులకు సమర్పించాలి. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ పరిశీలించిన తర్వాత కస్టమ్స్ సుంకం చెల్లింపుల్లో మినహాయింపు కల్పి్స్తారు. ఒమాన్‌లో తయారైన సరుకులు మాత్రమే కస్టమ్స్ సుంకం చెల్లింపు ప్రయోజనం అందిస్తారని కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఉపయోగాలు ఇవే..

భారత్, ఒమన్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం అవుతాయి. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యంలో భాగస్వాములుగా రెండు దేశలు ఉన్నాయి. ఇప్పుడు సుంకాల రాయితీలు వాణిజ్యాన్ని పెంచి, భారత మార్కెట్లో ఒమన్ ఉత్పత్తులను మరింత పోటీపడేలా చేస్తాయి. అలాగే రెండు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభించేలా చేస్తాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. ఒమన్-భారత్ మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యేలా ఈ ఒప్పంద సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో పలు వస్తువలు ధరలు తగ్గుతాయని అంటున్నారు. ఒమన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. దీని వల్ల దేశ ప్రజలకు లాభం జరగనుంది.

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..