కోవిడ్ మహమ్మారికి తోడు మిస్టీరియస్ ఫంగస్ కిల్లర్ కూడా ! అమెరికా ఆసుపత్రుల్లో రోగుల హైరానా

అమెరికాలో గల ఓ ఆసుపత్రిలో..ముఖ్యంగా ఫ్లోరిడాలో గల హాస్పిటల్ లో లోగడ వందలాది కోవిడ్ రోగులకు చికిత్స జరిగింది.

  • Umakanth Rao
  • Publish Date - 11:57 am, Sat, 9 January 21
కోవిడ్ మహమ్మారికి తోడు మిస్టీరియస్ ఫంగస్ కిల్లర్ కూడా ! అమెరికా ఆసుపత్రుల్లో రోగుల హైరానా

అమెరికాలో గల ఓ ఆసుపత్రిలో..ముఖ్యంగా ఫ్లోరిడాలో గల హాస్పిటల్ లో లోగడ వందలాది కోవిడ్ రోగులకు చికిత్స జరిగింది. వీరిలో అదనపు ఇన్ఫెక్షన్లతో గుర్తు తెలియని (మిస్టీరియస్) ఫంగస్ కూడా ఉన్నట్టు తేలింది. అత్యంత ప్రమాదకరమైన ఈ ఫంగస్ ను ‘క్యాండిడా ఔరిస్’ అని గుర్తించినట్టు ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మొదట 2009 లో దీన్ని జపాన్ లో కనుగొన్నారు. ఇది గ్లోబల్ గా వ్యాప్తి చెందుతుండడంతో అంటువ్యాధుల నివారణ విభాగం దీనిపై దృష్టి పెట్టింది.

ఫ్లోరిడా హాస్పిటల్ లో ఈ ఫంగస్ సోకిన సుమారు  40 శాతం మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా బ్రీతింగ్ ట్యూబ్స్ ను, లేదా పెద్ద నాళాల్లో ఉంచిన కేథటర్స్ తో చికిత్స పొందుతున్న రోగుల్లో ఈ ఫంగస్ కనిపించిందట. దీని ఆనవాళ్లు చెవుల ఇన్ఫెక్షన్ లోను, పేషంట్ల యూరిన్, రెస్పిరేటరీ శాంపిల్స్ లో కూడా కనిపించాయని డాక్టర్లు వెల్లడించారు. కరోనా వైరస్ కు చికిత్స పొందుతున్నవారిలో ఈ క్యాండిడా ఔరస్ స్పష్టంగా కనిపించిందని, ఫ్లోరిడా ఆసుపత్రిలో 35 మంది రోగులకు ఈ రుగ్మత సోకిందని వారు చెప్పారు. ఈ మిస్టీరియస్ ఫంగస్ మూలాలలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Also Read :మీ వ్యవహారం హుందాగా లేదు, శివసేన నేత సంజయ్ రౌత్ కు బాంబేహైకోర్టు చురకలు, అటు కంగనాపైనా ..
Also Read :తొలిసారి ఇండియాలోనూ మిస్టీరియస్ ‘మోనోలిథ్’, అహ్మదాబాద్ లో ప్రత్యక్షం ! పబ్లిక్ పార్క్ లో వింత, అంతా ఆశ్చర్యం