షాక్: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.!

తమ డిమాండ్ల సాధన కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేశారు. కేసీఆర్.. ఆర్టీసీ పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని కార్మికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లోకి చేరాలంటూ సీఎం పలుమార్లు డెడ్‌లైన్లు విధించినా వర్కర్లు లెక్క చేయలేదు. ఇక రోజులు గడిచే కొద్దీ పరిస్థితి తలక్రిందులు అయ్యాయి. హైకోర్టు, లేబర్ కోర్టుల్లో ఆర్టీసీ జేఏసీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో.. సమ్మెను విరమిస్తున్నామని.. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని […]

షాక్: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.!
Follow us

|

Updated on: Nov 27, 2019 | 10:10 PM

తమ డిమాండ్ల సాధన కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేశారు. కేసీఆర్.. ఆర్టీసీ పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని కార్మికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లోకి చేరాలంటూ సీఎం పలుమార్లు డెడ్‌లైన్లు విధించినా వర్కర్లు లెక్క చేయలేదు. ఇక రోజులు గడిచే కొద్దీ పరిస్థితి తలక్రిందులు అయ్యాయి. హైకోర్టు, లేబర్ కోర్టుల్లో ఆర్టీసీ జేఏసీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో.. సమ్మెను విరమిస్తున్నామని.. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.

అయితే ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా సమ్మెకు వెళ్లి.. మళ్ళీ విధుల్లోకి చేరుతామంటే ఎలా అంగీకరిస్తామంటూ కార్మికులను ప్రశ్నించింది. దీంతో 49,000 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు హైకోర్టు కూడా ఆర్టీసీ కార్మికుల మరణాలకు యూనియన్లే బాధ్యత వహించాలంటూ మరో షాక్ ఇవ్వగా.. జేఏసీ నేతలు కూడా ఇప్పుడు తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే మొన్నటి దాకా కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కార్మికలోకం ఇప్పుడు సడన్‌గా మనసు మార్చుకోవడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.

‘సీఎం కేసీఆర్ సారూ.. మీ మనసు నొప్పించి ఉంటే.. క్షమించండి.. దయ చేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోండి’ అంటూ  విన్నవించడమే కాకుండా ఆయన ఫొటోకు ముషీరాబాద్ ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేయడం విశేషం. ఇదంతా చూస్తుంటే.. కార్మికులు తమ తప్పును తెలుసుకుని.. ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. మరి ఇప్పుడైనా కేసీఆర్.. కార్మికుల పట్ల జాలి చూపి.. తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Latest Articles
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..