AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాపులకు జగన్ బంపర్ బొనాంజా.. బెనిఫిట్స్ అదిరిపోయాయిగా..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపు ప్రజలకు బంపర్ బొనాంజా ప్రకటించారు. కాపు నేస్తం పేరిట కొత్త స్కీమ్‌ ప్రకటించి భారీగా నిధులు కేటాయించేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏటా 15 వేల రూపాయలివ్వాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. కొత్త బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త […]

కాపులకు జగన్ బంపర్ బొనాంజా.. బెనిఫిట్స్ అదిరిపోయాయిగా..!
Rajesh Sharma
|

Updated on: Nov 27, 2019 | 6:17 PM

Share

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కాపు ప్రజలకు బంపర్ బొనాంజా ప్రకటించారు. కాపు నేస్తం పేరిట కొత్త స్కీమ్‌ ప్రకటించి భారీగా నిధులు కేటాయించేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏటా 15 వేల రూపాయలివ్వాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. కొత్త బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కడప జిల్లాలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులివ్వాలని, జగనన్న విద్యాదీవెన, ఆరోగ్య శ్రీ కార్డులను కొత్తవి జారీ చేయాలని ఏపీ కేబినెట్ బుధవారం భేటీలో నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ఆర్ నవశకం, కొత్త పెన్షన్ కార్డులు, పెన్షన్ అర్హతల్లో మార్పులు, చేర్పులపై కేబినెట్ చర్చించింది.

గ్రాడ్యుయేషన్.. ఆపై చదువులు చదువుకునే విద్యార్థులకు జగనన్న వసతి సౌకర్య పథకం పేరుతో సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇవ్వాలని ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పలు అంశాలపై సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు:

* వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం.

* ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కోసం 3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.

* ఇనుప ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం

* ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయం

* రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెంచాలని నిర్ణయం

* ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం 3,400 కోట్ల రూపాయలు కేటాయింపు

* 2.25 లక్షల రూపాయలకు తక్కువ వార్షికాదాయం ఉన్నవారికి విద్యాదీవెన స్కీమ్ వర్తింపు

* సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ ఏర్పాటుకు ఆమోదం

* గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం భారీగా పెంపు. ప్రస్తుతమున్న 400 నుంచి 4వేల రూపాయలకు పెంపుదల

* టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచాలని నిర్ణయం

* వచ్చే ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీకి నిర్ణయం

* 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం

* జగనన్న వసతి పథకానికి కేబినెట్‌ ఆమోదం​.

* రెండు విడతలుగా జగనన్న వసతి దీవెనకు 2,300 కోట్లు కేటాయింపు

* ఐటీఐ విద్యార్థులకు 10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15వేలు వార్షిక చెల్లింపు

* డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి 20వేలు ఆర్థిక సాయం

* వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి 1,101కోట్లు కేటాయింపు

* కాపు సామాజిక మహిళలకు ఏడాదికి  15వేలు సాయం

* 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో 75వేలు సాయం

* రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్‌ కాపు నేస్తం వర్తింపు

* పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు

* ట్రాక్టర్‌, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు