AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ టిక్‌టాక్‌ వీడియో-అమెరికా, చైనా మధ్య దుమారం

టిక్‌టాక్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. కేవలం వినోదం కోసమే కాదు. పలుసమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. రకరకాలవీడియోలు చేసి పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్‌ యువతి చేసినవీడియో..చైనా, అమెరికా మధ్య రాజకీయ దుమారమే లేపింది. చైనాలో ముస్లింలనునిర్బంధించి వేధిస్తున్నారంటూ ఆమె పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో పాటువివాదాస్పదమైంది. ఐనా సరే తాను వెనక్కి తగ్గేదే లేదంటోంది ఆ యువతి. టిక్‌టాక్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. కేవలం వినోదం కోసమే […]

ఓ టిక్‌టాక్‌ వీడియో-అమెరికా, చైనా మధ్య దుమారం
Pardhasaradhi Peri
|

Updated on: Nov 28, 2019 | 7:24 PM

Share

టిక్‌టాక్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. కేవలం వినోదం కోసమే కాదు. పలుసమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. రకరకాలవీడియోలు చేసి పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్‌ యువతి చేసినవీడియో..చైనా, అమెరికా మధ్య రాజకీయ దుమారమే లేపింది. చైనాలో ముస్లింలనునిర్బంధించి వేధిస్తున్నారంటూ ఆమె పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో పాటువివాదాస్పదమైంది. ఐనా సరే తాను వెనక్కి తగ్గేదే లేదంటోంది ఆ యువతి.

టిక్‌టాక్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌. కేవలం వినోదం కోసమే కాదు. పలు సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. రకరకాల వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్‌ యువతి చేసిన వీడియో..చైనా, అమెరికా మధ్య రాజకీయ దుమారమే లేపింది. చైనాలో ముస్లింలను నిర్బంధించి వేధిస్తున్నారంటూ ఆమె పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో పాటు వివాదాస్పదమైంది. ఐనా సరే తాను వెనక్కి తగ్గేదే లేదంటోంది ఆ యువతి.

ఫిరోజా అజీజ్‌. న్యూజెర్సీకి చెందిన ఆఫ్ఘన్‌ అమెరికన్‌ యువతి. రకరకాల టిక్‌టాక్‌ వీడియోస్‌ చేసి పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా చైనా జిన్జియాంగ్‌లోని నిర్బంధ శిబిరాల్లో కనీసం ఒక మిలియన్ మంది ముస్లింలను నిర్బంధించినట్లు వెల్లడించింది అజీజ్‌. మేకప్‌ టిప్స్‌ చెబుతూ..మధ్యలో చైనాలో ఉయగర్‌ ముస్లింల కష్టాలను తెలిపింది. వారిని కిడ్నాప్‌ చేసి హత్య చేయడం, అత్యాచారం చేయడం, మతం మారమని బలవంతం చేయడం, ఇలా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ పేర్కొంది. దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నానని తెలిపింది. 40 సెకన్ల నిడివి గల ఈ టిక్‌టాక్‌ వీడియో వైరల్‌గా మారింది.  1.4 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో పాటు లైకులు, షేర్లు వచ్చాయి. ఐతే మేకప్‌ ట్యుటోరియల్‌ ముసుగులో ఇలాంటి వీడియోలు తీస్తూ ప్రజలను రెచ్చగొడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనీయులు. జపాన్‌, సిరియా, ఇరాక్‌లాంటి దేశాల్లో అమెరికా చేసిన అకృత్యాలపై మాట్లాడరెందుకంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఫిరోజా అజీజ్‌  వీడియో వివాదాస్పదంగా మారడంతో ఆమె అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది టిక్‌టాక్‌. ఫిరోజా ఓ వీడియో క్లిప్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటోను షేర్‌ చేసిందని..ఇలాంటి ఉగ్రవాద సంబంధిత సమాచారం ప్రచారం చేయడం తమ కంపెనీ సహించదని పేర్కొంది. అందుకే అజీజ్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేశామని స్పష్టం చేసింది.  దీనిపై స్పందించిన ఫిరోజా ..ఇలాంటి ఘటనలు తనను అడ్డుకోలేవని పేర్కొంది. నిజాలు మాట్లాడితే చైనా ప్రభుత్వం భయపడి ఇలాంటి చర్యలు తీసుకుందని ఆరోపిస్తోంది.