‘ జుట్టుకు ఏ షాంపూ వాడావ్.?’ లేడీ ఫ్రెండ్లీ ఎలుగు ఏం చేసిందంటే.?

ఎలుగుబంటిని చూడగానే దూరంగా పారిపోతాం. అది మనపై దాడి చేస్తుందేమోనని భయపడిపోతాం. కానీ ఈ వీడియో చూస్తే మీరే షాకవుతారు. ఓ మహిళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అయింది ఈ నల్లని ఎలుగుబంటి. మెక్సికో మోంటెర్రెలోని చిపిన్క్యూ ఎకోలాజికల్‌ పార్క్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. పార్క్‌లో ఆహారం కోసం వెతుకుతున్న రెండు ఎలుగుబంట్లు..పర్యాటక బృందంలో ఓ మహిళ దగ్గరకు వెళ్లాయి. వాటిలో ఓ బ్లాక్‌ బేర్‌ వెనక కాళ్లపై నిలబడి కొన్ని సెకన్ల […]

' జుట్టుకు ఏ షాంపూ వాడావ్.?'  లేడీ ఫ్రెండ్లీ ఎలుగు ఏం చేసిందంటే.?
Pardhasaradhi Peri

|

Nov 28, 2019 | 5:15 PM

ఎలుగుబంటిని చూడగానే దూరంగా పారిపోతాం. అది మనపై దాడి చేస్తుందేమోనని భయపడిపోతాం. కానీ ఈ వీడియో చూస్తే మీరే షాకవుతారు. ఓ మహిళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అయింది ఈ నల్లని ఎలుగుబంటి. మెక్సికో మోంటెర్రెలోని చిపిన్క్యూ ఎకోలాజికల్‌ పార్క్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది.

పార్క్‌లో ఆహారం కోసం వెతుకుతున్న రెండు ఎలుగుబంట్లు..పర్యాటక బృందంలో ఓ మహిళ దగ్గరకు వెళ్లాయి. వాటిలో ఓ బ్లాక్‌ బేర్‌ వెనక కాళ్లపై నిలబడి కొన్ని సెకన్ల పాటు ఆమె జుట్టును సున్నితంగా సవరించి కామ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసి పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్స్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో పాటు వెరైటీ వెరైటీ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. వీడియో చాలా బావుందని కొందరు అంటుండగా..మరికొందరు క్రూరమృగాలకు ఆహారం పెట్టడం మంచిది కాదని అంటున్నారు. మరోవైపు శాంటా కాటరినా సివిల్‌ ప్రొటెక్షన్‌..ఎలుగుబంట్లకు తినిపించడం, ఫొటోలు తీయడం చేయొద్దని కోరింది. గోధుమ, గ్రిజ్లీ ఎలుగుబంట్ల కంటే బ్లాక్‌ బేర్స్‌ దాడి చేసిన ఘటనలు చాలా అరుదని అంటోంది. ఐతే 2017లో కూడా ఓ ఎలుగుబంటి ఓ బాలికతో ఆడుకున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu