AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Retirement: ‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

రనౌట్ తో తన కెరీర్ ప్రారంభించాడు.. 'తలా'గా యావత్ క్రికెట్ ప్రపంచానికి దగ్గరయ్యాడు. లెజెండ్ గా ఎందరో యువ క్రికెటర్లకు, కెప్టెన్లకు ఆదర్శంగా నిలిచాడు. అతడే మహేంద్ర సింగ్ ధోని..

MS Dhoni Retirement: 'రనౌట్'తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
Ravi Kiran
|

Updated on: Aug 16, 2020 | 9:52 AM

Share

MS Dhoni Retirement: రనౌట్ తో తన కెరీర్ ప్రారంభించాడు.. ‘తలా’గా యావత్ క్రికెట్ ప్రపంచానికి దగ్గరయ్యాడు. లెజెండ్ గా ఎందరో యువ క్రికెటర్లకు, కెప్టెన్లకు ఆదర్శంగా నిలిచాడు. అతడే మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరే ఒక సంచలనం.. 2004లో భారత్ జట్టులోకి వచ్చిన ఈ ఝార్ఖండ్ డైనమేట్.. 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి భారత్ జట్టు సారధ్య బాధ్యతలను తీసుకుని వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

మ్యాచ్ పరిస్థితి ఏదైనా కూడా.. ధోని క్రీజ్‌లో ఉన్నాడంటే విజయం భారత్ వైపే ఉంటుందని అభిమానుల నమ్మకం. అంతేకాక మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉన్నా.. వికెట్ల వెనుక కూల్‌గా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనిని మించినోడు లేదని చెప్పాలి. అటు డీఆర్ఎస్ సిస్టంకు కూడా తన పేరును పెట్టుకున్నాడు. కొన్నిసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పు కావచ్చు. కానీ ధోని ఒక్కసారిగా ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అది ఎప్పుడూ పర్ఫెక్ట్. బ్యాటింగ్‌లో తన దూకుడును ప్రదర్శిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

1983 తర్వాత ఇండియాకు వన్డే ప్రపంచకప్ సాధించడమే కాకుండా.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు వెన్నంటే ఉండి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. వన్డేలు, టీ20లు ఆడుతూ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ వరకు.. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు జట్టును నడిపించాడు.  350 వన్డేలు ఆడిన మహీ 10,773 పరుగులు చేశాడు. అలాగే 90 టెస్టుల్లో 4876 రన్స్‌ సాధించాడు.

ఇదిలా ఉంటే ధోని కెరీర్ కు ఓ రనౌట్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2019 వన్డే ప్రపంచకప్ లో జట్టును గెలిపించే సమయంలో ధోని రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ కు అయినా తన అభిమాన ఆటగాడిని చూడాలనుకున్న ఫ్యాన్స్ కు కరోనా అడ్డంకిగా మారింది. ఇక ఇవాళ తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు ధోని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపాడు. కాగా, రనౌట్ తో ప్రారంభమైన ధోని కెరీర్.. అదే రనౌట్ కారణంగా ముగిసింది.

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..