తిరువనంతపురం సెంట్రల్ జైలులో కరోనా కలకలం
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్ 1.0 ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా పోలీసు డిపార్ట్‌మెంట్‌తో..
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్ 1.0 ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా పోలీసు డిపార్ట్‌మెంట్‌తో పాటుగా.. జైళ్లలో కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది. తాజాగా కోల్లాం జిల్లాలోని తిరువనంతపురం సెంట్రల్ జైలులో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. మరో యాభై మంది ఖైదీలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ సంతోష్ తెలిపారు.
ఇదిలావుంటే మరోవైపు కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల కోజికోడ్ విమాన ప్రమాద సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. అయితే అక్కడి సహాయక చర్యల్లో పాల్గొన్న పలువురు అధికారులు కరోనా బారినడపడ్డారు. దీంతో సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సీఎంఓ వెల్లడించింది.
Three officials and 50 prisoners in Central Jail tested #COVID19 positive today. Total 266 prisoners lodged in Thiruvananthapuram Central Jail and Kollam district jail have tested #COVID19 positive so far: Santhosh S, DIG, Prisons (Headquarters) #Kerala
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా