బాలీవుడ్ స్టార్ హీరోతో ధోనీ స్టైలిష్ ఫొటో!

అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తన్హాజీ శుక్రవారం తెరపైకి రానుంది. అజయ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇది అతని కెరీర్‌లో 100 వ చిత్రం. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్‌గన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనితో కలిసి దిగిన ఒక పిక్ ను సోషల్ మీడియాలో “క్రికెట్ మరియు ఫిల్మ్స్ … మన దేశాన్ని ఐక్యంగా ఉంచే మతాలు”. అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఈ పిక్ […]

బాలీవుడ్ స్టార్ హీరోతో ధోనీ స్టైలిష్ ఫొటో!

అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తన్హాజీ శుక్రవారం తెరపైకి రానుంది. అజయ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇది అతని కెరీర్‌లో 100 వ చిత్రం. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్‌గన్ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనితో కలిసి దిగిన ఒక పిక్ ను సోషల్ మీడియాలో “క్రికెట్ మరియు ఫిల్మ్స్ … మన దేశాన్ని ఐక్యంగా ఉంచే మతాలు”. అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇద్దరి అభిమానులు వారి హృదయపూర్వక సందేశాలతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు అజయ్ దేవ్‌గన్ రాబోయే చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు, మరికొందరు ధోనిని తిరిగి జట్టులోకి రమ్మని అభ్యర్థిస్తున్నారు.

ధోని లేకపోవడంతో, టీమ్ ఇండియా ఆ స్థానాన్ని యువ ఆటగాడు రిషబ్ పంత్ కు అప్పగించింది. కాగా.. ఐపీఎల్ లో తనని తాను నిరూపించుకుంటేనే టీ20 ప్రపంచకప్ లో ధోనికి అవకాశం లభిస్తుందని శాస్త్రి స్పష్టంచేశాడు.

అజయ్ దేవ్‌గన్‌తో పాటు, తన్హాజీ స్టార్ కాస్ట్‌లో కాజోల్, సైఫ్ అలీ ఖాన్ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు.
కాజోల్ తనాజీ మలుసారే భార్య సావిత్రిబాయి మలుసారే పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ఉదయ్ భన్ పాత్రను పోషించారు.

https://www.instagram.com/p/B7FlWz1pnfO/?utm_source=ig_web_copy_link

Click on your DTH Provider to Add TV9 Telugu