గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అస్త్రాలు..ప్రచారానికి గంభీర్, కుష్భూ..పక్కా ప్రణాళిక !

దుబ్బాక ఉపఎన్నిక విజయంతో బీజేపీ మంచి జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికలకు బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ప్రచారం కోసం పార్టీలోని...

  • Ram Naramaneni
  • Publish Date - 1:18 pm, Sun, 22 November 20
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అస్త్రాలు..ప్రచారానికి గంభీర్, కుష్భూ..పక్కా ప్రణాళిక !

దుబ్బాక ఉపఎన్నిక విజయంతో బీజేపీ మంచి జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికలకు బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ప్రచారం కోసం పార్టీలోని ప్రముఖులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఇటీవల పార్టీలో చేరిన సినీ నటి కుష్భూ,  యువ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు కుదిరితే జనసేనాని సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది.

కేంద్రమంత్రులు ప్రకాష్ జావదేకర్, సృతీ ఇరానీ సహా పలువరు రోడ్ షో లు నిర్వహిస్తారని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పది మంది స్టార్ క్యాంపైనర్స్ బరిలోకి దిగారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందనరావు..ఇప్పటికే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండగా…డీకే అరుణ, రాజసింగ్  కేంద్రం  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, మురళీదరరావు, వివేక్, లక్ష్మణ్, గరికపాటి మోహనరావు ఇంటింటి ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పక్కా ప్రణాళిక సిద్దం చేశారు బీజేపీ పెద్దలు.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్