AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ మొదలు పెట్టేశారు..

అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పూజా హెగ్డే...

మళ్లీ మొదలు పెట్టేశారు..
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2020 | 3:08 PM

Share

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ మళ్లీ తిరిగి సెట్స్ మీదికి వచ్చింది. ఈ విషయాన్ని పూజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్‌లు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసుకుంటున్నారు.

ఇటీవలే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్‌ను ప్రారంభించారు. హీరోయిన్ నభా నటేష్‌తో స్టెప్పులేశారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ధైర్యంగా షూటింగ్ ప్రారంభించారు.

అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పూజా హెగ్డే పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

View this post on Instagram

The band’s back together…??? #glamsquad #mosteligiblebachelor

A post shared by Pooja Hegde (@hegdepooja) on

‘మళ్లీ సెట్లోకొచ్చాను’ అని తన టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం ఈ అక్కినేని హీరో బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.