AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం

Boat Accident: ఈ మధ్య కాలంలో పడవ ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పడవ ప్రమాదం జరిగి 150 మంది ప్రయాణికులు గల్లంతైన ఘటన నైజీరియాలో

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం
Boat Accident
Subhash Goud
|

Updated on: May 27, 2021 | 6:05 AM

Share

Boat Accident: ఈ మధ్య కాలంలో పడవ ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పడవ ప్రమాదం జరిగి 150 మంది ప్రయాణికులు గల్లంతైన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. దేశంలోని సెంట్రల్‌ నైజర్‌ రాష్ట్రం నుంచి వాయువ్య కేబ్బి రాష్ట్రానికి పడవ వెళ్తుండగా ప్రమాదవశాత్తు నైజీర్‌ నదిలో మునిగిపోయింది. అయితే పడవలో సామర్థ్యం కంటే ఎక్కువ ప్రయాణికులు ఎక్కించారని నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ యూసుఫ్ బిర్మా మీడియాకు వెల్లడించారు. తాము 20 మందిని రక్షించామని, నలుగురు మరణించారని, మిగిలిన 156 మంది గల్లంతు అయ్యారని ఆయన తెలిపారు. అయితే వారంతా నీటిలో మునిగారని భావిస్తున్నట్లు నేషనల్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ స్థానిక మేనేజర్ వెల్లడించారు.

కాగా, నైజీరియా దేశంలోని ఇలాంటి పడవ ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. నదిలో ప్రమాదానికి గురైన పడవ పాతదని, ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారని ఆయన తెలిపారు. మాలేలోని మార్కెటుకు ప్రయాణికులు వెళుతుండగా ఈ పడవ ప్రమాదం జరిగింది.

ఇవీ కూడా చదవండి

Big Accident: నడి సముద్రంలో ఢీకొన్న రెండు దేశాలకు చెందిన పడవలు.. ముగ్గురు మృతి..

Photo of Sun: తొలిసారిగా సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి.. ఉపరితలంపై విస్ఫోటనాలను ఫోటో తీసిన ఆర్బిటర్..