ఔటర్‌కు మరిన్ని అందాలు.. ఇంటర్ ఛేంజ్‌ దగ్గర సూపర్ సౌలతులు

హైదరాబాద్ మహానగరానికి మణిమకుటంగా మారిన ఔటర్ రింగు రోడ్డుకు మరిన్ని అందాలు రానున్నాయి. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఔటర్ రింగు రోడ్డుపై వున్న..

ఔటర్‌కు మరిన్ని అందాలు.. ఇంటర్ ఛేంజ్‌ దగ్గర సూపర్ సౌలతులు

More facilities near outer ring road: హైదరాబాద్ మహానగరానికి మణిమకుటంగా మారిన ఔటర్ రింగు రోడ్డుకు మరిన్ని అందాలు రానున్నాయి. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఔటర్ రింగు రోడ్డుపై వున్న ఇంటర్ ఛేంజ్ రింగు రోడ్ల వద్ద మరిన్ని సౌలతులు (సౌకర్యాలు) కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం రూపొందించిన ప్లాన్లు, నమూనాలు ప్రస్తుతం తుది రూపును సంతరించుకుంటున్నాయి.

పిపిపి ప్రాతిపదికన అధునాతన సేవలు అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఔటర్ రింగు రోడ్డు మీద వున్న ఇంటర్ చేంజ్‌ల వద్ద రెస్ట్ అండ్ రిలాక్స్ సెంటర్లు, ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కే.తారక రామారావు ఆదేశాలను ఆచరణలో పెడుతున్న హెచ్ఎండిఎ… వాటికి డిజైన్లను రూపొందిస్తోంది. ఇందుకోసం ఔత్సాహిక సంస్థల నుంచి టెండర్లు పిలిచింది హెచ్ఎండిఎ.

ఈ డిజైన్లు ఫైనలైజ్ అయితే… ఇప్పటికే మహా నగరానికి తలమానికంగా ఉన్న ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్ఆర్) పరిసరాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఓఆర్ఆర్ వెంట మరిన్ని వసతులు ఏర్పాటు కానున్నాయి. పిపిపి ప్రాతిపదికన అధునాతన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ చర్యలు తీసుకుంటోంది.

రింగ్ రోడ్డు మీద వున్న ఇంటర్ చేంజ్‌ల దగ్గరున్న ఖాళీ స్థలాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రయాణీకుల అవసరాలకు అనుగణంగా రెస్ట్ అండ్ రిలాక్స్ సెంటర్లు, ఫ్యూయల్ స్టేషన్లు, షాపింగ్, పార్కింగ్, పిల్లలకు క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇందుకోసం ఔత్సాహిక సంస్థల నుంచి హెచ్ఎండిఎ టెండర్లు ఆహ్వానించింది. దాంతో రింగు రోడ్డుపైకి వెళ్లే మార్గాలు, రింగు రోడ్డు నుంచి కిందకు దిగే ప్రాంతాలు ప్రయాణీకులకు సెదతీర్చే కేంద్రాలుగా మారనున్నాయి.

ఔటర్​ రింగు రోడ్డు వెంట ఉన్న 19 ఇంటర్​ చేంజ్​ల వద్ద వినూత్న రీతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఇటీవల నిర్వహించిన హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. దాంతో గత కొన్ని రోజులుగా వాటి రూపకల్పనలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

ఓఆర్ఆర్​ వెంట ఉన్న ​ ఇంటర్​ చేంజ్​ల వద్ద పబ్లిక్​ ప్రైవేట్​ పార్టనర్​ షిప్​(పిపిపి) మోడల్​లో ‘‘మల్టీ ఫ్యూయల్​ స్టేషన్స్​ కమ్​ వే సైడ్​ ఎమినిటీస్​ ” ఏర్పాట్లకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వాటిని కార్యాచరణలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన సన్నాహాల్లో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జిసిఎల్​) అధికారులు నిమగ్నమయ్యారు.

ఓఆర్ఆర్ పరిధి​లో మొత్తం 19 ఇంటర్​ చేంజ్​లు ఉండగా, ప్రాథమికంగా ఎనిమిది చోట్ల ‘‘మల్టీ ఫ్యూయల్​ స్టేషన్స్​ కమ్​ వేసైడ్​ ఎమినిటీస్​” ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్​ ఇంటర్​ చేంజ్​ ల వద్ద ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్​, డిజిల్​, సీఎన్​జీ, బ్యాటరీ ఛార్జింగ్​ వంటి మల్టీ ఫ్యూయల్​ స్టేషన్లతో పాటు ఫుడ్​ కోర్టులు, వాష్​ రూమ్స్​, లోకల్​ హాండీక్రాఫ్ట్స్​ అవుట్​ లెట్, గ్రోసెరీ అండ్​ మెడికల్​ షాపులు, కార్లు, బస్సులు, ట్రక్కుల కోసం పార్కింగ్​ సదుపాయాలు, వెహికిల్​ సర్వీస్​ సెంటర్లు, ఇంటర్​ సిటీ బస్​ టర్మినల్స్​, ఆఫీస్​ బిల్డింగ్స్​ తదితర వాటిని దశలవారీగా ఏర్పాటు అవుతాయి. మొదటి దశలో ‘వే సైడ్ ఎమినిటీస్’ ఏర్పాటు కానున్న ఎనిమిది ఇంటర్ ఛేంజ్‌లలో పటాన్​ చెరు, మేడ్చెల్​, శామీర్​ పేట్​, ఘట్​ కేసర్​, పెద్ద అంబర్​ పేట్​, బొంగులూరు, నార్సింగి, పోలీస్​ అకాడమి ప్రాంతాలు ఉన్నాయి.

Also read: పండగలున్నాయని ఆదమరవొద్దు.. కేంద్ర మంత్రి హెచ్చరిక

Also read: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం

Also read: దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం

Click on your DTH Provider to Add TV9 Telugu