AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ క్యూ.. రేటు ఎంతో తెలుసా…?

కరోనా విజృంభించిన వేళ తమిళనాటలో బిర్యానీ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. పలుజిల్లాల్లో భారీగా ఆఫర్లు ప్రకటించడంతో బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. కోవిడ్‌ నిబంధనలు బేఖాతరు చేశారు. తిరుచ్చి, మధురై , దిండిగల్‌తో పాటు చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 10 పైసలకే బిర్యానీ ప్రకటించడంతో జనం క్యూ కట్టారు...

బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ క్యూ.. రేటు ఎంతో తెలుసా...?
Sanjay Kasula
|

Updated on: Oct 11, 2020 | 3:51 PM

Share

Biryani Day : ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. గాలి నుంచి వ్యాప్తి చెందుకుతున్న కరోనాను గాలికి వదిలిపెట్టారు. కొవిడ్ 19 కట్టుబాట్లను తుంగలో తొక్కారు. ఆఫర్ కోసం పరుగులు పెట్టారు. సండే కాలో బిర్యానీ అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు రావడం ఆలస్యం.. అన్నింటినీ వదిలేశారు. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం లేకుండా గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. తమిళనాడులో చాలా జిల్లాల్లో బిర్యానీ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

బిర్యానీ డే పేరుతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించారు. వ్యాపారంలో పోటీ పెరిగిపోవడంతో.. ఒకరిని మించి మరొకరు ఆఫర్లను ప్రకటించారు. ఓ ప్రముఖ రెస్టారెంట్ మరింత ముందు ప్రచారం చేసింది. తమ రెస్టారెంట్‌లో బిర్యానీ కేవలం 10 పైసలు అంటూ ప్రచారం అదరగొట్టింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలోకి రావడంతో ఇంకేంముంది. ఈ ఉదయం నుంచి అక్కడికి చేరుకుని క్యూ కట్టారు.

కరోనా విజృంభించిన వేళ తమిళనాటలో బిర్యానీ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం కలకలం రేపుతోంది. పలుజిల్లాల్లో భారీగా ఆఫర్లు ప్రకటించడంతో బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. కోవిడ్‌ నిబంధనలు బేఖాతరు చేశారు. తిరుచ్చి, మధురై , దిండిగల్‌తో పాటు చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 10 పైసలకే బిర్యానీ ప్రకటించడంతో జనం క్యూ కట్టారు. కిలోమీటర్ల మేర బిర్యానీ కోసం లైన్లు కనబడ్డాయి. అయితే క్యూలైన్లలో జనం సామాజిక దూరం పాటించడం మరిచిపోయారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదిలావుంటే బెంగళూరులో ఓ ప్రముఖ రెస్టారెంట్‌ భారీ ఆఫర్ ప్రటించింది. దీంతో ఉదయం 5 గంటల నుంచే బిర్యానీ కోసం జనం క్యూ కట్టారు. ఈ క్యూ లైన్ కాస్తా గంటన్నరలో 1.5 కిలోమీటర్ వరకు చేరింది. బిర్యానీ తినేందుకు కుటుంబాలతో సహా అక్కడి చేరుకొన్నారు. కనీసం కరోనా నిబంధనలను కూడా వారు పాటించలేదని స్థానికులు అంటున్నారు.

Follow Us
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..