ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఎక్కడ చూసినా..చెరువులన్నీ నిండుగా కళకళలాడుతున్నాయని, మరో రెండేళ్ల వరకు నీటి సమస్య ఉండదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా.

ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు
Ram Naramaneni

|

Dec 09, 2020 | 5:10 PM

రాష్ట్రంలో ఎక్కడ చూసినా..చెరువులన్నీ నిండుగా కళకళలాడుతున్నాయని, మరో రెండేళ్ల వరకు నీటి సమస్య ఉండదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. నగరిలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ హయాంలో ఎక్కడ చూసినా నీరు సమృద్ధిగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ జగనన్న సీఎం కావడంతో పుష్కలంగా వర్షాలు పడ్డాయని చెప్పారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాల వల్లే ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరి పురపాలక పరిధి తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్‌ ట్యాంక్‌ పూర్తిగా నిండింది. ట్యాంక్‌ నిర్మాణం జరిగిన పదేళ్ల తర్వాత అది తొలిసారి పూర్తిగా‌ నిండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ట్యాంక్‌ వద్ద జలహారతి నిర్వహించారు.

Also Read :

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్, వైద్య విద్య చదవకుండానే చికిత్స, ప్రజల ప్రాణాలతో చెలగాటం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu