పదేళ్ల క్రితం తప్పిపోయిన కుర్రాడు.. దగ్గరకు చేర్చిన ఫేస్‌బుక్‌

తప్పిపోయిన యువకుడు తిరిగి చూస్తామో లేదో అనుకున్న సమయంలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో కుటుంబసభ్యుల్లో సంతోషం వెల్లువిరిసింది. పదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన ఓ టీనేజ్ కుర్రాడు ఇంటర్నెట్ పుణ్యమాని మళ్లీ తన కుటుంబం చెంతకు చేరాడు.

పదేళ్ల క్రితం తప్పిపోయిన కుర్రాడు.. దగ్గరకు చేర్చిన ఫేస్‌బుక్‌
Follow us

|

Updated on: Jul 23, 2020 | 5:56 PM

తప్పిపోయిన యువకుడు తిరిగి చూస్తామో లేదో అనుకున్న సమయంలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో కుటుంబసభ్యుల్లో సంతోషం వెల్లువిరిసింది. పదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన ఓ టీనేజ్ కుర్రాడు ఇంటర్నెట్ పుణ్యమాని మళ్లీ తన కుటుంబం చెంతకు చేరాడు. పంజాబ్‌ రాష్ట్రంలోని పటియాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌కి చెందిన చెవిటి, మూగవాడైన అబ్దుల్ లతీఫ్ 2010లో తప్పిపోయాడు. దారితప్పిన బాలుడు పంజాబ్‌ వీధుల్లో ఏడుస్తూ ఓ వ్యక్తి దొరికాడు. తన కుటుంబసభ్యుల వివరాలను మూగవాడైన కుర్రాడు చెప్పలేకపోయాడు. దీంతో బాలుడిని చేరదీసి పెంచుకున్నాడు, అయితే, లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పటియాలా స్కూల్లో విద్యార్ధులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో.. అబ్దుల్ ఫేస్‌బుక్‌లో తనవాళ్ల కోసం వెతికాడు. తన చిన్ననాటి మిత్రుడొకరు ఫేస్‌బుక్‌లో కనిపించడంతో అతడిని సంప్రదించాడు. దీంతో అబ్దుల్ స్నేహితుడు ఎట్టకేలకు అతడిని గుర్తించాడు. ఈ సమాచారాన్ని అబ్దుల్ కుటుంబసభ్యలకు అందించాడు. వెంటనే అతన్ని వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు పటియాలా చేరుకున్నారు. కనిపించకుండా పోయిన అబ్ధుల్ ను మళ్లీ దగ్గరకు చేరేలా ఫేస్‌బుక్‌ ఎంతో దోహదపడిందని సంబరాన్ని వ్యక్తం చేశారు.