సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత: కేటీఆర్
రోడ్లు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల పల్లెలు సైతం ఆర్థికాభివృద్ధికి నోచుకొంటాయని రాష్ట్ర ఐటీ, పుపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
రోడ్లు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల పల్లెలు సైతం ఆర్థికాభివృద్ధికి నోచుకొంటాయని రాష్ట్ర ఐటీ, పుపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గత ఆరెండ్లలో గణనీయమైన పురోగతి సాధించామని మంత్రి వెల్లడించారు. రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్తు తరాలు బాగుపడాలనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారానికి పూనుకున్నదని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
500 మంది జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న కేటీఆర్.. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సుపరిపాలన అందిస్తురన్నారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్న మంత్రి.. కరోనా కష్టకాలంలో కూడా ఇప్పటి వరకు 57 లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. మనం అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్న కేటీఆర్.. అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోడు భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని వెల్లడించారు. కేసీఆర్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని మంత్రి కేటీఆర్ తెలిపారు.