ప్ర‌తిఒక్క‌రికీ మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్య‌ంః కేటీఆర్

ప్ర‌తిఒక్క‌రికీ మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్య‌ంః కేటీఆర్

ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ మెరుగైన వైద్యం అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి స్పష్టం చేశారు.

Balaraju Goud

|

Nov 12, 2020 | 1:58 PM

ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ మెరుగైన వైద్యం అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి స్పష్టం చేశారు. గురువారం నాంప‌ల్లి ప‌రిధిలోని స‌య్య‌ద్ న‌గ‌ర్‌లో మంత్రి కేటీఆర్ బ‌స్తీ ద‌వ‌ఖానాను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఐఎం ఎమ్మెల్యే జాఫ‌ర్ హుస్సేన్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

బ‌స్తీ ద‌వాఖాన ప్రారంభం అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలోని బ‌స్తీ ద‌వాఖానాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా బస్తీ దవఖానాల్లో డ‌యాగ్నోస్టిక్ సేవ‌లు కూడా అందుబాటులో ఉంటాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్ప‌టికే 224 బ‌స్తీ ద‌వ‌ఖానాలు ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. మ‌రో ,125 బ‌స్తీ ద‌వ‌ఖానాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని ఆయన తెలిపారు. బ‌స్తీ ద‌వాఖానాల ద్వారా పేదల‌కు మెరుగైన వైద్యం అందుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే బస్తీ దవఖానాల్లో చెక్ చేయించుకోవాలని మంత్రి సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu