AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. పొరపాటు జరిగింది.. 8,000 మందిని తొలగించిన తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ స్పందన!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటా సైతం AI ఆధారిత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కంపెనీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రపంచ టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

అయ్యో.. పొరపాటు జరిగింది.. 8,000 మందిని తొలగించిన తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ స్పందన!
Meta Ceo Mark Zuckerberg
Balaraju Goud
|

Updated on: Jun 15, 2026 | 11:57 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటా సైతం AI ఆధారిత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కంపెనీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రపంచ టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది ప్రారంభంలో మెటా సంస్థ తన AI వ్యూహాన్ని వేగవంతం చేయడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి చివరి నాటికి కంపెనీలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉండగా, మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మందిని తొలగించింది. అదే సమయంలో మరో 7,000 మంది ఉద్యోగులను AI-సంబంధిత ప్రాజెక్టులు, సాంకేతిక విభాగాలు, కొత్త బాధ్యతలకు బదిలీ చేసింది.

అయితే ఈ ప్రక్రియ పూర్తిగా విజయవంతం కాలేదని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. ఉద్యోగులను ఉద్దేశించి అంతర్గత లేఖ ఒకటి లభించినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. దీని ప్రకారం ఆయన AI పరివర్తన ప్రక్రియలో కొన్ని తప్పులు జరిగాయని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా కంపెనీ తనను తాను మార్చుకుంటోందని, ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ సంస్థలు AI ఆధారిత వ్యవస్థలను తమ కార్యకలాపాల్లో భాగం చేస్తున్నాయి. మెటా కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఉద్యోగులు నిర్వహించిన కొన్ని పనులను AI ఏజెంట్ల ద్వారా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది.

ఈ భారీ మార్పుల నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో ఇకపై ఉద్యోగుల తొలగింపులు ఉండవని జుకర్‌బర్గ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, AI విప్లవం కారణంగా టెక్నాలజీ రంగంలో సంభవిస్తున్న మార్పులు ఏ ఒక్క కంపెనీ నియంత్రణలో ఉండవని ఆయన స్పష్టం చేశారు.

AI యుగంలో పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి మెటా చేపడుతున్న ఈ చర్యలు భవిష్యత్తులో టెక్ పరిశ్రమలో ఉద్యోగాల స్వరూపాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కొత్త అవకాశాలు సృష్టిస్తూనే, మరోవైపు సంప్రదాయ ఉద్యోగాలపై ఒత్తిడి పెంచుతున్న AI ప్రభావం టెక్ రంగ భవిష్యత్తును నిర్ణయించనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us