Wealth Astrology: ఆ రాశులకు బుధుడి కటాక్షం..వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
Mercury Transit 2026: మే 30న మిథున రాశిలోకి ప్రవేశించిన బుధ గ్రహం ప్రభావంతో వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి జూన్ 22 వరకు ఆర్థికంగా అనుకూల సమయం ఏర్పడనుంది. వ్యాపారాలు, షేర్లు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల ద్వారా అంచనాలకు మించిన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుని సంపద వృద్ధికి దోహదపడే కాలంగా జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Budh Gochar
జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ గ్రహం మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడు. మే 30న తన స్వక్షేత్రమైన మిథున రాశిలో ప్రవేశించిన ఈ బుధుడు (Budh Gochar 2026) కొన్ని రాశుల వారికి వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా సంపన్నులను చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మదుపులు, పెట్టుబడులకు వీరికి జూన్ 22 వరకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలు, వ్యాపారాల్లో పెట్టుబడులు, షేర్లు, ఆర్థిక లావాదేవీలు వంటివి అత్యధికంగా లాభాలనిస్తాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు అంచనాలను మించి లబ్ధి పొందుతారు.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల ఈ రాశివారికి వ్యాపార దక్షణ కలుగుతుంది. ఎక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాల్ని మించి లాభిస్తాయి. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభిస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టు బడితో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా వీరికి అంచనాలకు మించి లాభాల పంట పండుతుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తుల మీద పెట్టుబడి పెట్టడం కూడా చాలా మంచిది.
- కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి వ్యాపారమైనా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. దూరదృష్టితో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసివస్తుంది.
- తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తప్పకుండా లాభాల పంట పండుతుంది. ప్రస్తుతం ఎటువంటి వ్యాపారం తల పెట్టినా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి బుధుడి సంచారం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపా రాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.
Follow Us