Shukra Gochar: కర్కాటక రాశిలోకి శుక్రుడు..వారికి భోగభాగ్యాలు, ఆకస్మిక ధనలాభం!
Venus Transit 2026: జూన్ 9 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు ఆదాయ వృద్ధి, కుటుంబ సుఖం, ప్రేమ, దాంపత్యం, ఆర్థిక లాభాల పరంగా అనూహ్యమైన శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. ఈ 25 రోజుల కాలంలో వీరి జీవితాలు సాఫీగా సాగి అనేక అనుకూల పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Shukra Gochar 2026
సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు త్వరలో రాశి మారబోతున్నాడు. ఈ నెల(జూన్) 9వ తేదీ నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్న శుక్ర గ్రహం వల్ల కొన్ని రాశుల వారు ఆదాయ వృద్ధితో సహా అనేక విధాలుగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది. అనుబంధాలు, భావోద్వేగాలకు నిలయమైన కర్కాటక రాశిలో ప్రేమలు, బంధాలు, శృంగారం, సంపదకు కారకుడైన శుక్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అనూ హ్యమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు 25 రోజుల పాటు నల్లేరు మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల శుక్రుడికి దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఊహించని మనశ్శాంతిని పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. మాతృ సౌఖ్యంతో పాటు మాతృమూలక ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల తెలివితేటలు, నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యంతో పాటు హోదా కూడా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కర్కాటకం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల జనాకర్షణ బాగా పెరుగుతుంది. రాజకీయంగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల దాంపత్య జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితంలో లేదా కుటుంబ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి, శ్రమ పూర్తిగా తగ్గిపోయి, ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభించవచ్చు. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు కలుగుతాయి.
- మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యతలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ఒత్తిడి వంటివి తగ్గి, ఉత్సాహం పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
Follow Us